జర్నలిస్టుల సమస్యలపై స్పందించే సంఘం టీడబ్ల్యూజేఎఫ్ – ఎమ్మెల్యే వెంకట్రావు
భద్రాచలం, మార్చి 15, అద్దం న్యూస్ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బలంగా ఉందని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,...