Addam News
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 8:59 am Posted by : Addam News

జర్నలిస్టు పల్లె రవిని పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు నేత పల్లె రవికుమార్‌ను పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర నాయకులు పరామర్శించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్ తదితరులు గురువారం ఎల్‌బిన‌గ‌ర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు పల్లె రవిని పలకరించి ప్రమాదం జరిగిన పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల క్రితం ఉన్నట్టుండి హఠాత్తుగా కళ్ళు తిరిగి కిందపడిపోవడంతో కుడికాలు మడమ వద్ద ఎముక విరిగిందని, వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png