జర్నలిస్టు పల్లె రవిని పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు నేత పల్లె రవికుమార్‌ను పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర నాయకులు పరామర్శించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్ తదితరులు గురువారం ఎల్‌బినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు పల్లె రవిని పలకరించి ప్రమాదం జరిగిన పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల...