తెలంగాణ జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్ – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

హన్మకొండ, జూన్ 13, అద్దం న్యూస్ :   తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం వర్కింగ్ జర్నలిస్టులకు అండగా నిలిచే పెద్ద సంఘం అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా మూడవ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు హనుమకొండ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు...