టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ రద్దు – డిసెంబర్ లో రాష్ట్ర మహాసభలు – రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 15, అద్దం న్యూస్ :    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) తృతీయ మహాసభలు డిసెంబర్ లో జరపాలని ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. కాలపరిమితి ముగిసినందున ఫెడరేషన్ రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ తీర్మానించింది. రాష్ట్ర మహాసభల నిర్వహణకు కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సమావేశం తీర్మానించింది. శనివారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల...