దేవునితోట భవాని శంకర దేవాలయంలో ఉగాది పంచాగ శ్రవణం
హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో వాడ వాడలా ఉగాది వేడుకలు జరిగాయి. నియోజకవర్గంలోని భోలక్‌పూర్ డివిజన్ దేవునితోట శ్రీ భవాని శంకర దేవాలయంలో ఆదివారం ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు మురళీధర శర్మ, రామకృష్ణ శాస్త్రీ, అరవింద్ కుమార్ తదితరులు పంచాంగాన్ని వినిపించారు. రాశిఫలాలు, పండుగలు, శుభ ముహూర్తాలు, గ్రహస్థితి, వర్ష సూచనలు, ఇతర ముఖ్యమైన విషయాలను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్,...