అంతిమంగా నిజమే గెలిచింది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్

అంతిమంగా నిజమే గెలిచింది
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింద‌ని, అంతిమంగా నిజ‌మే గెలిచింద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ‘ నిజం గెలిచింది ’ పేరుతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు గురువారం దోమ‌ల‌గూడ‌లోని హైద‌రాబాద్‌ నగర టిడిపి పార్టీ కార్యాలయ నాయకులు, కార్యకర్తల స్థాయిలో 53 దీపాలు వెలిగించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ లు హాజ‌ర‌య్యారు. నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అర్థరాత్రి వేళ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, 53 రోజుల పాటు జైలులో బంధించిన చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆ 53 రోజులకు సంకేతంగా 53 దీపాలను వారు వెలిగించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… నాడు చంద్రబాబు నిర్బంధానికి నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ” నిజం గెలవాలి ” అంటూ మద్దతుగా నిలిచారు. ఆ పోరాటానికి ప్రతిఫలంగా న్యాయస్థానాలు మరియు ఈడీ ( ED ) అక్రమ కేసులన్నింటిని కొట్టేసి క్లీన్ చిట్ ఇవ్వడంతో, అంతిమంగా ” నిజం గెలిచింది ” అనే సందేశాన్ని వేడుకగా జరుపుకుంటున్న‌ట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిరంకుశత్వానికి, అక్రమ అరెస్టుకు నిరసనగా సెప్టెంబ‌ర్ 9వ తేదీని ‘ బ్లాక్ డే ‘ గా పాటిస్తూనే, సత్యం, ప్రజాస్వామ్యం విజయం సాధించిన సందర్భాన్ని ప్రతిబింబించేలా ఈ దీపారాధన కార్యక్రమం చేపట్టామ‌న్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కక్ష సాధింపు రాజకీయాలకు న్యాయస్థానాల తీర్పులే గట్టి సమాధానం చెప్పాయని, ప్రజాస్వామ్యంలో అంతిమంగా సత్యమే జయిస్తుందనే సందేశాన్ని ఈ ‘ నిజం గెలిచింది ’ కార్యక్రమం ద్వారా ప్రతి పార్టీ శ్రేణుల ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు తడక వినోద్, శ్యాంసుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, కట్ట రాములు, చంద్రమోహన్ గౌడ్, ఓ.వెంకటేష్ చౌదరి, భవాని శ్రీనివాస్, సత్తన్న, బి.రాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page