పెద్ద కూతురి మృతి భ‌రించ‌లేక చిన్న కూతురితో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌ – అంబ‌ర్‌పేట‌లో విషాదం – ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న‌

అంబ‌ర్‌పేట‌, నవంబర్ 22, అద్దం న్యూస్ :    ఐదు నెల‌ల క్రితం పెద్ద కూతురు చ‌నిపోవ‌డంతో అప్ప‌టి నుంచి తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన దంప‌తులు త‌మ చిన్ని కూతురితో క‌లిసి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. హైద‌రాబాద్ అంబ‌ర్‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో బాగ్ అంబ‌ర్‌పేట‌ రామ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో శ‌నివారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈస్ట్ జోన్ డిసిపి బాల‌స్వామి తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. బాగ్ అంబ‌ర్‌పేట రామ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో నివసించే శ్రీనివాస్ ( 45 )కు భార్య విజ‌య‌లక్ష్మీ ( 42 ), కుమార్తెలు...