Addam News
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 9:01 am Posted by : Addam News

నిరుద్యోగ జాబ్ మేళాకు విశేష స్పందన – హాజరైన 5200 అభ్యర్థుల్లో 2100 మందికి ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగ జాబ్ మేళాకు విశేష స్పందన
– హాజరైన 5200 అభ్యర్థుల్లో 2100 మందికి ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 11, అద్దం న్యూస్ :   ప్రముఖ సంఘ సేవకులు దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో గురువారం నిర్వ‌హించిన‌ ఉచిత మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో 195 కంపెనీలు పాల్గొనగా 5200 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిలో 2010 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జాబు నిరుద్యోగ జాబ్ నిర్వాహకులు టి దినకర్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు రావడంలేదని తెలిపారు. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, ప్రైవేట్ ఆస్పత్రులు యజమాన్యాలు, హోటల్ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఈ నిరుద్యోగ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిరుద్యోగ మేళాకు 5000 మందికి పైగా నిరుద్యోగులు పాల్గొనగా, వారిలో 2100 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని నిరుద్యోగ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అదే విధంగా తనకు తనకు వీలైనంత వరకు ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అన్ని విధాల సేవా కార్యక్రమాలు అందిస్తానని దినకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దినకర్ రెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png