Addam News
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 11:30 pm Posted by : Addam News

కేర్ హాస్పిటల్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఆస్తమా అవగాహన శిబిరానికి అనూహ్య‌ స్పందన

 

కేర్ హాస్పిటల్ ఆస్తమా అవగాహన శిబిరానికి అనూహ్య‌ స్పందన

 

ఉచిత ఆస్త‌మా శిబిరంలో ప‌రీక్ష‌లు చేస్తున్న దృశ్యం
                          ఉచిత ఆస్త‌మా శిబిరంలో ప‌రీక్ష‌లు చేస్తున్న దృశ్యం

హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ :   ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ కేర్ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఉచిత ఆస్త‌మా అవ‌గాహ‌న‌, ప‌రీక్ష శిబిరం జ‌రిగింది. “ప్రతి క్షణం స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి” అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ శిబిరానికి 80 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. వారు పల్మనాలజీ వైద్యులను ఉచితంగా కలుసుకుని, ఉచిత ఊపిరితిత్తుల పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఆస్తమా లక్షణాలు ఎలా గుర్తించాలో, దాని కారణాలు ఏమిటో, సరైన మందుల వాడకం ఎలా ఉండాలో తెలిపే అవగాహన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ముషీరాబాద్ కేర్ హాస్పిట‌ల్ సీనియ‌ర్ ప‌ల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్‌.స‌య్య‌ద్ అబ్దుల్ స‌లీమ్ మాట్లాడుతూ….ఆస్తమా గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఉచిత శిబిరాన్ని, అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వహించ‌డం జ‌రిగింద‌న్నారు. “చాలా మంది తమకు ఆస్తమా ఉందని కూడా తెలియదని.. కొంత మంది ఇన్హేలర్‌ను సరైన విధంగా ఉపయోగించటం లేదన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2025 థీమ్ “ఇన్హేల్డ్ చికిత్సలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ శిబిరాన్ని నిర్వ‌హించామ‌ని తెలిపారు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్ట‌ర్‌.భారతి మాట్లాడుతూ.. ఇలాంటి అవగాహనా, ఉచిత ఆరోగ్య శిభిరాలు ప్రజల్లో ఉన్న భయాలను తగ్గించి, వారు త్వరగా వైద్యం తీసుకోవాలని ప్రోత్సహిస్తాయన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png