Addam News
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 3:05 am Posted by : Addam News

ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి

ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి

సికింద్రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   సికింద్రాబాద్ సీనియ‌ర్ సెక్ష‌న్ ఇంజినీర్ కార్యాల‌యం ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ పై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతి చెంది ఉండ‌టాన్ని చిల‌క‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్‌ బిసి–1 సిబ్బందికి శుక్ర‌వారం స‌మాచారం వ‌చ్చింది. క్లూస్ టీం స‌హాయంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసు సిబ్బంది మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. మృతుడి వ‌ద్ద ఎటువంటి గుర్తింపు ఆధారాలు ల‌భించ‌లేదు. మృతుడి వేలిముద్రలు, ఫోటోలు సేకరించి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వ‌య‌స్సు 55–60 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ వ‌య‌స్సు ఉండ‌వ‌చ్చని పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్య‌క్తిని ఎవరైనా గుర్తిస్తే చిలకలగూడ పోలీస్‌స్టేష‌న్‌లో స‌మాచారం తెలియ‌చేయాల‌ని పోలీసులు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png