Addam News
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 2:25 pm Posted by : Addam News

అప్పుడే పుట్టిన బేబీకి నిప్పట్టించి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన బేబీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పట్టించి తగలబెట్టారు. చెత్తా చెదారంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో  శిశువుకు నిప్పు అంటించిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ను రప్పించారు. ఆ మృత శిశువు ఎవరిది.. ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎవరు నిప్పంటించారనే విషయాలు విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png