విద్యార్థులకు అందించే యూనిఫాం ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి – స‌మీక్ష‌లో అధికారుల‌కు సూచించిన‌ సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) :   విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి శ‌నివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని సమావేశంలో అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్...