Addam News
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 4:53 am Posted by : Addam News

గ‌ణేష్ మండ‌పాల‌ను సంద‌ర్శించిన కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   వినాయ‌క‌చ‌వితి న‌వ‌రాత్రుల్లో భాగంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పాల‌ను కేంద్ర మంత్రి హోంశాఖ స‌హాయ‌ బండి సంజ‌య్ శుక్ర‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మండ‌పాల్లోని విఘ్నేశ్వ‌రుడి విగ్ర‌హాల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికృష్ణ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో బండి సంజ‌య్ కు ఘ‌నంగా స‌న్మానం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిజేపి రాష్ట్ర నాయ‌కుడు రొయ్యూరు శేష సాయి, ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గడ్డం నవీన్, నాయ‌కులు జనార్దన్ రెడ్డి, రాజ్ కుమార్, కిషోర్, శివ, విజయానంద్, ఎంసీ మోహన్, రోహిత్, రమేష్ గుప్తా, నాగరాజ్, లక్ష్మణరావు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ… ఆ బొజ్జ గణపయ్య కరుణాకటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png