Addam News
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 12:21 pm Posted by : Addam News

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స‌హ‌కారంతోనే ర‌బ్బ‌ర్ స్పీడ్ బ్రేక‌ర్ల ఏర్పాటు

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స‌హ‌కారంతోనే ర‌బ్బ‌ర్ స్పీడ్ బ్రేక‌ర్ల ఏర్పాటు



హైదరాబాద్, జులై 12, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ విద్యాన‌గ‌ర్ అచ్యుత‌రెడ్డి మార్గ్‌లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపి కిష‌న్‌రెడ్డి స‌హ‌కారంతో ర‌బ్బ‌ర్ స్పీడ్ బ్రేక‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు విశ్వ‌నాథ‌శాస్త్రి తెలిపారు. ఈ మేర‌కు స్పీడ్ బ్రేక‌ర్ల ఏర్పాటును శ‌నివారం ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అచ్యుత‌రెడ్డిమార్గ్‌లో స్పీడ్ బ్రేకర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని స్థానికుల విజ్ఞ‌ప్తుల‌ను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి దృష్టికి తాను తీసుకెళ్లాన‌న్నారు. ఆయ‌న స‌హ‌కారంతో ట్రాఫిక్ ఏసిపి సంప‌త్ కుమార్‌, జిహెచ్ఎంసి డిఈ స‌న్ని, ఏఈ విశేష్‌నాయ‌క్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ శివ త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో స్పీడ్ బ్రేక‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. స్థానికులు చాలా సంతోషంగా ఉన్నార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానికులు చంద్ర‌శేఖ‌ర్, వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png