Addam News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 5:18 am Posted by : Addam News

అలయ్–బలయ్-2026 కు రావాల‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :          ద‌స‌రా సంద‌ర్భంగా అల‌య్ – బ‌ల‌య్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హంచే ” అలయ్ బలయ్ – 2026 “ కు రావాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, అల‌య్–బ‌ల‌య్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ లు కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం న్యూఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసి ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌చేశారు. ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ సంవ‌త్స‌రం ఈ నెల 22వ తేదీన హైద‌రాబాద్‌లో అల‌య్–బ‌ల‌య్ ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, అల‌య్–బ‌ల‌య్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ లు తెలిపారు.