కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం

కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం – ధ‌ర్నాచౌక్‌లో జ‌రిగిన నిర‌స‌న‌లో వ‌క్త‌లు హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :   దళితులపై వివక్ష, అవమానకర చర్యలను సహించబోమని ప‌లువురు వ‌క్త‌లు స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమించాలని వ‌క్త‌లు పిలుపునిచ్చారు. తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ ప్రసాద్‌ రావుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాదిగ...