హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టిపిసిసి ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటన జారీ చేసింది. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకులు సోనియా గాంధీ కి, రాహుల్ గాంధీ కి, జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ కు, తెలంగాణ ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయని ఆర్య వైశ్య బిడ్డగా నాకు అవకాశం కల్పించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పని చేస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులను కలుపుకుంటూపోతానని ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png