Addam News
Newspaper Banner
Date of Publish : 08 June 2025, 12:59 am Posted by : Addam News

అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్

అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్

                   కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్

హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ :    ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ ( ఐవిఎఫ్ ) రంగారెడ్డి జిల్లా మ‌హిళా విభాగ్ ఆధ్వ‌ర్యంలో మ‌ణికొండ మర్రిచెట్టు దగ్గర ఐవిఎఫ్ రంగారెడ్డి జిల్లా మహిళ విభాగ్ అధ్యక్షురాలు బండ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి ప్ర‌చార క‌మిటీ రాష్ట్ర కో-క‌న్వీన‌ర్, తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ ఛైర్మ‌న్, అంత‌ర్జాతీయ ఆర్య వైశ్య ఫెడ‌రేష‌న్ జాతీయ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్, రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త, ఐవిఎఫ్ ప్ర‌ధ‌మ మ‌హిళ ఉప్ప‌ల స్వ‌ప్న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం గొప్పది అని అన్నారు. అన్నప్రసాద వితరణ ద్వారా అనేక మందికి ఆకలి తీర్చిన వార‌మ‌వుతామ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ మహిళా విభాగ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ అనూష, కోశాధికారి శ్వేత, అడిషనల్ జనరల్ సెక్రెటరీ లావణ్య, మాధురి, చవత, స్వప్న, కటకం శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల, అర్చన, జూబ్లీ హిల్స్ ఐవిఎఫ్ మహిళ విభా గ్ అధ్యక్షురాలు స్వాతి, చింతల రజినీకాంత్ గుప్త, లోకేష్, శ్రీనివాస్, ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png