Uranium: తల్లి పాలల్లో యురేనియం.. పసిబిడ్డలకు ప్రమాదమా..?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తల్లి పాలు బిడ్డకు అమృతం అంటారు. అయితే, ఇటీవల నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఓ కొత్త అధ్యయనం 'తల్లిపాల'లో ప్రమాదకరమైన అంశం ఉన్నట్లు వెల్లడించి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీహార్‌లోని ఆరు జిల్లాలకు చెందిన దాదాపు 40 మంది బాలింతల తల్లి పాల నమూనాలలో యురేనియం (Uranium) (U-238) ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయంపై హడావుడి జరిగినప్పటికీ, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇచ్చిన స్పష్టత తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది. అధ్యయనంలో బయటపడిన సంచలన నిజాలు.. పరిశోధించిన అన్ని నమూనాలలో...