టెక్సాస్‌లో కలకలం.. భారత సంతతి విద్యార్థి అరెస్టు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో ఉంటున్న ఒక భారత సంతతి విద్యార్థి ఉన్మాదంతో ప్రవర్తించిన ఘటన టెక్సాస్‌లో కలకలం రేపింది. సొంత కుటుంబ సభ్యులపైనే వరుస దాడులకు దిగుతూ, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న మనోజ్ సాయి లేళ్ల (22) అనే యువకుడిని కొల్లిన్ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.   టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న మనోజ్ సాయి, గత కొంతకాలంగా తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. తెలుగు మూలాలున్న ఈ యువకుడు...