రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఆసీస్ సీనియర్ బ్యాటర్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా (Usman Khawaja) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచే తన చివరిదని 39 ఏళ్ల ఖవాజా వెల్లడించాడు. 2011లో ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికైన ఖవాజా తన కెరీర్‌లో 87 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20ల్లో మొత్తం 8001 పరుగులు చేశాడు. టెస్టుల్లో 16 శతకాలు చేశాడు. ఈనెల 4న సిడ్నీ వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. అద్భుతమైన కెరీర్.....