పవన్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోందని దర్శకుడు అధికారికంగా వెల్లడించారు. సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ పనితీరును ప్రశంసిస్తూ హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్–హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ‘దేఖ్‌లేంగే సాలా’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్...