Addam News
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 4:53 am Posted by : Addam News

పిల్లలకు టీకాలు వేయించి.. దేశం సురక్షిత స్థితిని కొనసాగించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

పిల్లలకు టీకాలు వేయించి.. దేశం సురక్షిత స్థితిని కొనసాగించాలి

– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 12, అద్దం న్యూస్ :   పిల్లలకు టీకాలు వేయించి.. దేశం సురక్షిత స్థితిని కొనసాగించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో ఆదివారం ప‌ల్స్ పోలియో నివార‌ణ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై చిన్నారుల‌కు పోలియో నివార‌ణ చుక్క‌ల‌ను వేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ…. 2011 నుంచి భారతదేశం పోలియో రహితంగా ఉంది.. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించి.. దేశం సురక్షిత స్థితిని కొనసాగించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పోలియో వైరస్ తిరిగి ప్రబలకుండా చూసేందుకు ప్రత్యేకంగా పల్స్ పోలియో టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. నవజాత శిశువుల నుంచి ఐదేళ్ల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి టీకా అందేలా విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయకులు శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, నర్సు కృపా రాణి, అంగన్‌వాడి టీచర్ నరసమ్మ, ఆశా వర్కర్లు దుర్గా, భవాని, ఆయా మాణిక్యమ్మ పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png