నిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

నిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :    నిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి అని గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్య‌క్ర‌మం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌రై వాజ్‌పేయి చిత్రపటాన్ని పూలమాలలు...