వాజపేయి సేవలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి – హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : భారతదేశ రాజకీయాలలో అటల్ బిహారీ వాజపేయికి ఒక  ప్రత్యేకమైన స్థానం ఉందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి అన్నారు. బూత్ అధ్యక్షుడు బండారు  ప్రశాంత్ ఆధ్వర్యంలో వాజపేయి శత జయంతి ఉత్సవాల సమీక్ష సమావేశం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దీపక్ రెడ్డి, గౌతమ్‌రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి మాట్లాడుతూ..భారతదేశం కోసం వాజపేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వాజపేయి గురించి ప్రతి బూత్‌లో, ప్రతి డివిజన్‌లో కార్యక్రమాలను నిర్వహించి...