Addam News
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 8:43 am Posted by : Addam News

‘పాఠశాలల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి చేయాలి’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ‘వందే మాతరం’ (Vande Mataram) జాతీయ గేయాన్ని తప్పనిసరి చేయాలని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (MP Sudhamurthy) పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె.. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

‘‘ఓ ఎంపీ గానో, రచయిత గానో, వితరణశీలి గానో ఇక్కడ నిలబడలేదు. భరతమాత కుమార్తెగా నిలబడ్డా. విదేశీ పాలకుల తీరుతో మనం విశ్వాసాన్ని కోల్పోయి, తీవ్ర నిరాశలో కూరుకుపోయాం. అలాంటి సమయంలో అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వచ్చినట్లు వందేమాతరం వచ్చింది. బలహీనులనూ తిరగబడేలా వారిలో స్ఫూర్తి నింపింది.

వందేమాతరం స్వాతంత్ర్య పోరాటాన్ని సూచిస్తుంది. స్వాతంత్ర్యం అనేది మనకు వెండి పళ్లెంలో పెట్టి రాలేదు. ఎంతో మంది పోరాటం, త్యాగాల ఫలితమిది. దీని గురించి పాఠశాలల్లో చిన్నారులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని తప్పనిసరి చేయాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సుధామూర్తి (MP Sudhamurthy) పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png