‘పాఠశాలల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి చేయాలి’
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ‘వందే మాతరం’ (Vande Mataram) జాతీయ గేయాన్ని తప్పనిసరి చేయాలని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (MP Sudhamurthy) పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె.. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ‘‘ఓ ఎంపీ గానో, రచయిత గానో, వితరణశీలి గానో ఇక్కడ నిలబడలేదు. భరతమాత కుమార్తెగా నిలబడ్డా. విదేశీ పాలకుల తీరుతో మనం విశ్వాసాన్ని కోల్పోయి, తీవ్ర నిరాశలో కూరుకుపోయాం. అలాంటి సమయంలో అగ్నిపర్వతం బద్దలై లావా...