Addam News
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 4:17 pm Posted by : Addam News

జాతిని ఒకటి చేసిన వందేమాతరం నినాదం – బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ

హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ :    కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త వందేమాతరం నినాదం జాతిని ఒకటి చేసింద‌ని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ జి అన్నారు. వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా బీజేపీ గాంధీనగర్ డివిజన్ ఆధ్వర్యంలో డివిజన్ అభ్యుదయ హై స్కూల్ విద్యార్థులతో వందేమాతరం గీతాలాపన చేయించి వారిచేత వాగ్దానం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి భారత్ గౌడ్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్ తివారి మాట్లాడుతూ… వందేమాతరం అనేది భారత జాతీయ గీతం అని, దీనిని బంకిం చంద్ర ఛటర్జీ రచించారన్నారు. స్వాతంత్య్ర‌ పోరాటంలో ఈ గీతం ప్రజలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు గడిచినా సందర్భంగా విదేశీ వస్తువులను భాహిష్కరించి, స్వదేశి వస్తువులను కొనుగోలు చేయాలని తద్వారా భారత జాతి ఔన్నత్యాన్ని పెంపొందించాలని విద్యార్దులు, యాజమాన్యం, బిజెపి నాయకులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు టి.గోపాల్, రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, రాజు, సురేష్ రాజు, శ్రీనివాస్ యాదవ్, సాయి కుమార్, నీరజ్, జ్ఞానేశ్వర్, సంధ్య రాణి, సంయుక్త రాణి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png