Addam News
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 6:55 am Posted by : Addam News

ఘ‌నంగా వాసవి విద్యార్థినీ వసతి గృహం 43 వ వార్షిక హాస్టల్ డే వేడుకలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43 వ వార్షిక హాస్టల్ డే వేడుకల్లో ఘనంగా పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టిటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి విద్యార్థినులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ… విద్యార్థినులు విద్యాభ్యాసంలో ముందుకు సాగేందుకు ఇలాంటి వసతి గృహాలు ఎంతో మేలుకలిగిస్తాయని తెలిపారు. సురక్షిత వసతి, మంచి అకాడమిక్ వాతావరణం, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. టిటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ… విద్యే సమాజ ప్రగతికి ప్రధాన ఆధారం అని పేర్కొన్నారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభాపురస్కారాలు విద్యార్థినుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. నిర్వాహకులు హాస్టల్ డేను విజయంవంతం చేసినందుకు ఉప మేయర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png