Addam News
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 11:43 am Posted by : Addam News

Venus Williams: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ (Venus Williams) ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌ (Australian Open)లో పునరాగమనం చేస్తున్నారు. జనవరిలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్ ఛాంపియన్ అయిన ఆమె (Venus Williams).. కొన్ని రోజుల క్రితమే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన మోడల్, యాక్టర్‌ ఆండ్రియా ప్రెటిని పెళ్లి చేసుకున్నారు.

జనవరి 18 నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (Australian Open) ప్రారంభం కానుంది. ఈ ఓపెన్‌ మెయిన్ డ్రాలో తలపడనున్న పెద్ద వయస్కురాలు వీనసే (Venus Williams) కావడం గమనార్హం. ఇప్పుడు ఆమె వయసు 46 ఏళ్లు. అంతకుముందు ఈ రికార్డు జపాన్‌కు చెందిన కిమికో డేట్ పేరిట ఉండేది. ‘‘ఆస్ట్రేలియా ఓపెన్‌లో పునరాగమనం చేయడంపై సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’’ అని వీనస్ సంతోషం వ్యక్తంచేశారు. 1998లో ఈ టోర్నమెంట్‌లో ఆమె (Venus Williams) అరంగేట్రం చేశారు. ఈ టోర్నీలో రెండుసార్లు సింగిల్స్ ఫైనల్‌కు చేరిన ఆమె.. 2003, 2017లో తన చెల్లెలు సెరెనా విలియమ్స్ చేతిలో ఓడి, రన్నరప్‌గా నిలిచారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png