Addam News
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 8:03 am Posted by : Addam News

ఫ్యాన్స్‌ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ నటుడు

ఫ్యాన్స్‌ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ నటుడు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు, టీవీకే అధినేత విజయ్‌ (Vijay) చెన్నై ఎయిర్‌పోర్ట్‌ (Chennai airport)లో అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. తాజాగా మలేసియాలో జరిగిన ‘జన నాయగన్‌’ ఆడియో లాంఛ్‌ అనంతరం ఆయన చెన్నై చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పోలీసులు వారిని కంట్రోల్‌ చేసినప్పటికీ కొందరు విజయ్‌ని చూడడం కోసం ముందుకు వచ్చారు. దీంతో విజయ్‌ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు. పక్కనే ఉన్న సిబ్బంది ఆయన్ను సురక్షితంగా కారు ఎక్కించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ‘జన నాయగన్‌’ తన చివరి సినిమా అని విజయ్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

https://x.com/PTI_News/status/2005328523708489789?s=20

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png