విక్రమ్‌రావు మరణం జర్నలిస్టుల ఉద్యమానికి తీరని లోటు – సంతాపసభలో పలువురు వక్తలు

 హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :    జాతీయ జర్నలిస్టుల ఉద్యమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు దివంగత కోటంరాజు విక్రమ్‌రావు అకాల మరణం జర్నలిస్టుల ఉద్యమానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐఎఫ్ డబ్ల్యూజే ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయగాన సభలో దివంగత విక్రమ్‌రావు సంతాపసభ జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ...