బేగంబజార్‌లో 24 క్యారెట్ల బంగారం, అమెరికన్ వజ్రాల వినాయకుడు
బేగంబజార్, సెప్టెంబర్ 14, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితిని పురస్కరించుకొని హైదరాబాద్ బేగంబజార్ ఫీల్ ఖానాలోని ఓ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం హార్ట్ ఆఫ్ ది సిటీ అయింది. రూ.3.83 లక్షల విలువైన అమెరికన్ వజ్రాలతో, 24 క్యారెట్ల బంగారంతో 48 కేజీల పంచలోహం భారీ వినాయకుడి విగ్రహాన్ని ఆ షాపు నిర్వాహకులు తయారు చేయించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని యథావిధిగా ఉంచి, కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.![]()

![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png