నగరంలో ప్రారంభమైన వినాయకచవితి ఉత్సవాలు
నగరంలో ప్రారంభమైన వినాయకచవితి ఉత్సవాలు హైదరాబాద్, ఆగస్టు 27, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో వినాయకచవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వాడ వాడల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి తొలి పూజలను చేశారు. దీంతో పాటు ఆలయాల్లో సైతం వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుడికి అర్చకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ...