అన్నమాచార్యుల 618వ జయంతి సందర్భంగా విశ్వశాంతి సంకీర్తన యజ్ఞం
అన్నమాచార్యుల 618వ జయంతి సందర్భంగా విశ్వశాంతి సంకీర్తన యజ్ఞం హైదరాబాద్, మే 3, ( అద్దం న్యూస్ ) : తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యులు 618 వ జయంతి సందర్భంగా పద్మశ్రీ డాక్టర్.శోభారాజు స్థాపించిన అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అన్నమాచార్యుల విగ్రహం వద్ద విశ్వశాంతి సంకీర్తనా యజ్ఞం భక్తిభావంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు, అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా 100 మందికి పైగా శిక్షణ...