Addam News
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 4:43 am Posted by : Addam News

వైభ‌వంగా వరంగల్ భద్రకాళీ అమ్మవారి క‌ల్యాణోత్సవం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 12, అద్దం న్యూస్ :          హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం బుధ‌వారం 12 వ‌ రోజు ఘనంగా జరిగింది. శంఖారావంతో మొదలైన ఈ కార్యక్రమంలో ఓల్డ్ అల్వాల్ శ్రీభ్రామరి విజయశంకర వేదపాఠశాల వారిచే వేద పఠనం జరిగింది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహా శివ లింగానికి ప్రదోషకాల అభిషేకం జరిగింది. డా.జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనాన్ని వినిపించారు. వేదికపై నాగర్‌కోయిల్ నాగేంద్ర పూజ , సుబ్రహ్మణ్యస్వామికి కావడి ఉత్సవం భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు కోటి పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. బాసర మహాసరస్వతి పూజ భక్తులచే సరస్వతీ విగ్రహాలకు పూజ ,కోల్‌కతా కాళీ కుంకుమార్చన చాలా ప్రత్యేకంగా జరిగింది. వరంగల్ భద్రకాళీ అమ్మవారి క‌ల్యాణోత్సవం, డోకిపర్రు శ్రీ వేంకటేశ్వర కల్యాణం జరుగుతున్న సమయంలో శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందస్వామి, బృందావన్ మహామండలేశ్వర్ శ్రీ భాస్కరానందజీ మహారాజ్ స్వామి హాజ‌ర‌య్యారు. ఈ పూజ‌ల‌కు అతిధిలుగా హైదరాబాద్ న‌గ‌ర‌ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్, ఎంఈఐఎల్‌.కృష్ణారెడ్డి హాజ‌రై పూజ‌లు చేశారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png