ఖైరతాబాద్, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :
తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు హోటల్ ప్యారడైజ్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్ ప్యారడైజ్‌లో ( CAN నంబర్: 612182839 ) నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు. నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.![]()