ఎస్‌టిపిని సందర్శించిన జలమండలి ఈడీ

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ :   అంబర్‌పేట 212.5 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని అధికారులతో కలిసి బుధ‌వారం జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభించనున్న కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్‌టీపీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాంగణ ప్రవేశద్వారం, రహదారులు, పైలాన్, లాన్స్, పెయింటింగ్ వంటి అంశాలను పరిశీలించి మిగిలిన పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్‌టీపీ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు....