హైదరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : అక్టోబర్ 2వ తేదీన జరుగనున్న ఆరెకటిక రాష్ట్ర అధ్యక్షుడి బోగస్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఆరె కటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో అశోక్ దాదా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆరె కటికల జనాభా సుమారు 10 లక్షల పైగా ఉన్నారని, కేవలం 2911 మంది తన సొంత బంధువులు, తెలిసిన వారి జాబితాను తమారు చేసుకొని ఒక బోగస్ ట్రస్టును నడుపుతున్న తెలంగాణ ఆరె కటిక ట్రస్ట్ వ్యక్తులు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 2వ తేదీన అందరు వచ్చి ఎన్నికలో కనీసం 20 శాతం జనాలు లేదా 10 శాతం జనాల ఓటరు లిస్టు లేకుండా పోవడం సిగ్గుచేటన్నారు. కేవలం కోకాపేట్‌లోని ఒక ఎకరం భూమిని కబ్జా చేయడం లేదా దాని మీద గుత్తాధిపత్యం చెలాయించుకోవడమే తప్ప మరొకటి కాదన్నారు. ఒక ట్రస్ట్ గానీ, సంఘం కానీ ఎన్నికలను ప్రకటిస్తే వారు గతంలో కులాభివృద్ధి కోసం చేసిన పనులు, ఒక కరపత్రం ద్వారా తెలుపుతున్నారన్నారు. కులం బిడ్డల వద్ద చందాల పేరు మీద డబ్బులు వసూలు చేయడమే తప్ప వాళ్లు చేసిందేమి లేదన్నారు.
కనీసం రాష్ట్రంలో మహిళలు మన కులం బిడ్డలు ఉన్నారనే విషయం కూడా మర్చినారన్నారు. కులం మీద దౌర్జన్యంగా, బలవంతంగా ఎన్నికల అనే తంతును రుద్ది తూ తూ మంత్రంగా అధ్యక్షుని ఇప్పటికే వారు నిర్ణయించిన వారినే ఎన్నికల క్యాండిడేట్‌నే అందరి కుల బంధువుల ముందు ప్రకటించుకోవాలని చేస్తున్న కుట్రను మేం రాష్ట్ర ఆరె కటిక అభివృద్ధి సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పారదర్శకంగా లేని ఈ అధ్యక్ష ఎన్నికలను ముమ్మాటికీ బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో అరె కటిక అభిరుద్ధి సంఘం ఆధ్వర్యంలో కారు యాత్ర, గ్రామ, మండల, జిల్లా కమిటిల అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు అశోక్ దాదా తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png