Addam News
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 9:14 am Posted by : Addam News

నియోజ‌క‌వ‌ర్గంలోని కాల‌నీల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్

 కాల‌నీల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాం
– ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :     నియోజ‌క‌వ‌ర్గంలోని కాల‌నీలోని నెల‌కొన్న‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ప‌ద్మాకాల‌నీ, బృందావ‌న్ కాల‌నీలో రూ.12 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టిన మంచినీటి పైప్‌లైన్ ప‌నుల‌కు సోమ‌వారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌స్తీల‌తో పాటు కాల‌నీల్లో దీర్ఘ‌కాలికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నామ‌న్నారు. అందుకోసం ప్ర‌త్యేక నిధుల‌ను వెచ్చిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జలమండలి మేనేజర్ జీవ‌న‌జ్యోతి, బిఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహా, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, కాల‌నీ అధ్య‌క్షుడు సత్తయ్య గౌడ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భరత్ భూషణ్, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, కార్య‌నిర్వాహ‌క కార్యదర్శి చంద్రకాంత్, సభ్యులు రమణారెడ్డి, బాలరాజు, విజయలక్ష్మి, సురేఖ సోలంకి, లావణ్య, శిరీష, అరుణ, చంద్రకళ, గాయత్రి, రాంనగర్ డివిజన్ అధ్య‌క్షుడు శంకర్, ప్ర‌ధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బబ్లు, కిషన్ రావు, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png