Addam News
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 12:34 am Posted by : Addam News

మంచినీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నాం – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

మంచినీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నాం

– గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జులై 23, అద్దం న్యూస్ :     డివిజన్‌లో నెలకొన్న అతి తీవ్రమైన సమస్య మంచినీటి సరఫరా లో ప్రెషర్, క్రమంగా మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా పనులు చేపడుతున్నామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బుధవారం జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్, టిఆర్‌టి క్వాట‌ర్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వెనక వీధిలో జలమండలి అధికారులు చేపట్టిన నూతన మంచినీటి పైప్‌లైన్ల ఏర్పాటు పనులను వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణ మోహన్ వారి సిబ్బంది, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో కలిసి కార్పొరేటర్ పావ‌ని పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… డివిజన్ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న మంచినీటి లో ప్రెషర్, కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ఎండితో సమీక్షించి టిఆర్‌టి స్థానికుల ఫిర్యాదు మేరకు 4 ఇంచుల పాత పైప్‌లైన్ చోటే 6 ఇంచుల‌ నూతన మంచినీటి పైప్‌లైన్ల‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. పనులు కూడా కొనసాగుతున్నాయని, త్వరలో స్థానికులకు మంచినీటి లో ప్రెషర్ సమస్య కు శాశ్వత పరిష్కారం జ‌రుగుతుంద‌న్నారు. ఈ పనులను త్వరగతిన‌ పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు సాయి, శ్రీకాంత్, రఘు యాదవ్, స్థానికులు సత్యనారాయణ, వినోద్ భోంస్లే, దోనేటి శ్రీనివాస్, వాల్టాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png