హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని ఖండిస్తున్నాం – పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్‌, పొడ‌పంగి నాగ‌రాజు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని, క్యాంపస్ భూములను లాక్కోవడాన్ని ఖండిస్తున్నామ‌ని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్‌, పొడ‌పంగి నాగ‌రాజు లు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వాగ్దానం చేసి ఏడో గ్యారెంటీగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంద‌న్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం...