సికింద్రాబాద్‌లో గ‌త ప‌దేళ్లలో అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాం – ఎమ్మెల్యే తీగుల్ల ప‌ద్మారావుగౌడ్

సికింద్రాబాద్‌లో గ‌త ప‌దేళ్లలో అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాం – ఎమ్మెల్యే తీగుల్ల ప‌ద్మారావుగౌడ్ సికింద్రాబాద్, సెప్టెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :    సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత పదేళ్ళ కాలంలో అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించామని శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ తెలిపారు. శుక్రవారం మెట్టుగూడ డివిజన్ పరిధిలో రూ.1.30 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ది కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మెట్టుగూడ, స్కై లాబ్ హోటల్ వద్ద రూ.12.70 లక్షలు, విజయపురి, బతుకమ్మ కుంట...