Addam News
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 9:05 pm Posted by : Addam News

పోలియో ర‌హిత భార‌త దేశమే ల‌క్ష్యంగా అంద‌రం కృషి చేయాలి

పోలియో ర‌హిత భార‌త దేశమే ల‌క్ష్యంగా అంద‌రం కృషి చేయాలి
» గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని

హైద‌రాబాద్‌, జూన్ 28, ( అద్దం న్యూస్ ) :   ఐదు సంవత్సరాల వ‌య‌స్సులోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాల‌ని, పోలియో రహిత భారత్ మన లక్ష్యంగా అంద‌రూ కృషి చేయాల‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం ప‌ల్స్ పోలియో నివార‌ణ చుక్క‌లు వేసే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని హాజ‌రై చిన్నారుల‌కు పోలియో నివార‌ణ చుక్క‌ల‌ను వేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… పసి పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు వారి తల్లిదండ్రులు తప్పని సరిగా పోలియో నివార‌ణ చుక్కలు వేయించాలని అన్నారు. మీ దగ్గరలోని బూత్‌కు వెళ్లండి లేదా ఇంటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు సహకరించి పోలియో నివార‌ణ చుక్క‌ల‌ను వేయించాల‌న్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సంపత్ యాదవ్, జనప్రియ అపార్ట్‌మెంట్స్ సెక్రటరీ మల్లేష్, నర్సులు విజయ నిర్మల, తేజోమాయి, ఫైజా, ఆశావర్కర్ వ‌రలక్ష్మి పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png