గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిని తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి – తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : గాంధీజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి, ప్రజాసేవ, సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలో చింతల్ కాంగ్రెస్ నాయకుడు కిట్టు ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు...