హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : గద్దర్ అవార్డులను ఆపాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఆ పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణకు ఆదేశించడాన్ని స్వాగతీస్తున్నామని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, రాష్ట్ర కన్వీనర్ లారా, కో-కన్వీనర్ మోహన్ బైరాగి లు మాట్లాడుతూ… తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గద్దర్ అవార్డులను ఆపమని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఆ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం నైతికత ఉంటే హైకోర్టులో గద్దర్ అవార్డుల గురించి తేలే దాకా అవార్డులను ఆపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుండి తెలంగాణ సినిమా వేదిక పలు రూపాల్లో గద్దర్ ఫిలీం అవార్డుల గురించి మాట్లాడుతూనే ఉంది, కానీ ప్రభుత్వం ఆంధ్ర సినిమాలకు అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయిపోయిందన్నారు. దీని ద్వారా తెలంగాణ సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వమే అన్యాయానికి ఒడిగట్టిందన్నారు. తెలంగాణ సినిమా పెద్దలు, ఆర్టిస్టులు, కవులు కళాకారులు, అందరూ ఐక్యంగా తెలంగాణ సినిమా రంగానికి జరుగుతున్న అన్యాయం గురించి ఉద్యమాల్లోకి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర నాయకులు జి.రవి, సాయి, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png