నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం మ‌రిన్ని నిధుల‌ను కేటాయిస్తాం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 15, అద్దం న్యూస్ :    నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం మ‌రిన్ని నిధుల‌ను కేటాయిస్తామ‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని క‌వాడిగూడ డివిజ‌న్ అర‌వింద్‌న‌గ‌ర్‌లో శ‌నివారం సిసి రోడ్డు ప‌నుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ... నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్ల‌ల్లో పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతామ‌న్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈ సన్నీ, బిఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, శ్యామ్, గొల్ల‌గ‌డ్డ రాజశేఖర్ గౌడ్,...