పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రికి మద్దతు ఇస్తాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రి మోడీకి మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ...