Addam News
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 11:17 am Posted by : Addam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం  – రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,  పార్టీల, ప్రజాసంఘాల ప్రకటన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం  

 ఇచ్చిన హామీల విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులుగా తగిన బుద్ది చెబుతాం

– రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,  పార్టీల, ప్రజాసంఘాల ప్రకటన

హైదరాబాద్, అక్టోబ‌ర్ 13, అద్దం న్యూస్ :     జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామ‌ని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, ప‌లు పార్టీల, ప్రజాసంఘాల నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఇచ్చిన హామీల విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులుగా తగిన బుద్ది చెబుతామ‌ని హెచ్చ‌రించారు. సోమ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు – పార్టీల హామ‌లు … జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు సుద్దమళ్ళ వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రఫుల్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, మోహన్ బైరాగి, అంసోల్ లక్ష్మణ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, ప్రజ్యోత్ కుమార్, సుజి, లావణ్య, జానకి రెడ్డి, సుచరిత, 1969 ఉద్యమకారులు బోయపల్లి రంగారెడ్డి, శంకర్ రావ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేపథ్యంలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు నుండి ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ది చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించకుండా కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ద కాలం అణిచివేతకు పాల్పడ్డారని, నేడు ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉద్యమకారులను మభ్య పెడుతుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కనీసం ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ కూడా ప్రకటించకపోవడం విచారకరం అన్నారు. అందుకే వచ్చే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఉద్యమకారుల సత్తా చాటే ప్రయత్నం చేస్తామని అంటూ వక్తలు ప్రకటించారు. ఈ సమాలోచన సదస్సులో ఉద్య‌మ‌కారులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png